అన్ మాస్క్ కేన్సర్ కి అపోలో కేన్సర్ సెంటర్ ప్రోత్సహం -కేన్సర్ వారియర్స్ కు ప్రత్యేక అభినందనలు


 -అన్ మాస్క్ కేన్సర్ ద్వారా సమాజానికి మేల్కొలుపు

క్యాన్సర్ అనంతర జీవితం యొక్క గమనంలో వారికి ఏ విధమైన వివక్షా లేకుండా చూసే ప్రయత్నంలో భాగంగా అపోలో క్యాన్సర్ సెంటర్స్ (ACCS) అన్ మాస్క్ క్యాన్సర్" ను పరిచయం చేస్తోంది.. ఫిబ్రవరి 4వ తేదీ, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా, క్యాన్సర్ విజేతలు ఎదుర్కొంటున్న వివక్ష, దుష్పరిణామాలను, వివిధ వాస్తవ పరిస్థితులను తెలియజేయడానికి, ఆరోగ్య, మానసిక సమస్యలు పరిష్కరించడానికి అపోలో కేన్సర్ సెంటర్ సాహసోపేతమైన చర్యలకు ఉపక్రమిస్తోందని తెలియచేయడం జరిగింది.


విశాఖపట్నంలోని అపోలో క్యాన్సర్ సెంటర్, మెడికల్ & హేమాటో ఆంకాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రాకేష్ రెడ్డి బోయ మాట్లాడుతూ, "ACCలో మా మిషన్... ప్రపంచ స్థాయి వైద్య సంరక్షణను అందించడానికి అపోలో సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.. క్యాన్సర్ విజేత శ్రీమతి జయశ్రీ హట్టంగడి మాట్లాడుతూ.. "వివక్షకు భయపడి నా క్యాన్సర్ చరిత్రను దాచడం సంవత్సరాలుగా నేను మోస్తున్న భారం, 'అమ్మాస్క్ క్యాన్సర్' మా కథను పంచుకోవడానికి మరియు ఇతరులకు కూడా అదే విధంగా ప్రేరేపించడానికి సన్ను మరియు కుటుంబ సభ్యులను ప్రోత్సహించింది అని తెలియచేశారు.


సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డా|| సుమన్ దాస్ మాట్లాడుతూ క్యాన్సర్ కలిగిఉన్న వారి పట్ల విపక్ష నిర్ములన, వారి వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితాలకు ఆటంకం కలిగించకుండా చూడాల్సిన అవసరం సమాజానికి ఉంది అని, ఈ " అన్మార్క్ క్యాన్సర్" కార్యక్రమం ఈ క్లిష్టమైన సమస్య పరిష్కారానికి గొప్ప అవకాశం అని కొనియాడారు.


వీరితో పాటు డాక్టర్ రమేష్ ఆలమూరి, డాక్టర్ ఆదిత్య నారాయణ్, డాక్టర్ జయశ్రీ కూన, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ అరుణ్ కుమార్, వెంట్రపాటి, డాక్టర్ చంద్ర కళ్యాణ్, వి. బాలకృష్ణ(మెడికల్ సూపర్డెంట్)  రామచంద్ర చీఫ్ ఆపరేషన్ ఆఫీసర్ పాల్గొన్నారు.

అనిల్ కుమార్

స్టాఫ్ రిపోర్టర్

విశాఖపట్నం.